YS Jagan Schedule: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. స్వయంగా బాధితులను కలిసి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు


 


అధికార పార్టీ తెలుగుదేశం కార్యకర్త చేతిలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి.. బద్వేలు అత్యాచారం జరిగి హత్యకు గురయిన యువతి కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. ఈనెల 23వ తేదీన బుధవారం గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లి నుంచి మొదట గుంటూరు జిల్లాకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. యువతిని పరామర్శించిన అనంతరం ప్రత్యేక విమానం ద్వారా వైఎస్సార్‌ జిల్లాకు చేరుకుంటారని సమాచారం. కడప విమానాశ్రయం నుంచి దిగి బద్వేలులో బాధిత యువతి కుటుంబసభ్యులను కలవనున్నారు.

Also Read: YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహం


గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దౌర్జన్యం చేయడంతో ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతోంది. బుధవారం ఉదయం ఆస్పత్రిలో యువతిని, ఆమె కుటుంబసభ్యులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కలవనున్నారు. వారికి తామున్నామనే భరోసా ఇవ్వనున్నారు. పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసిన బద్వేలు సంఘటన బాధితురాలిని జగన్‌ పరామర్శించనున్నారు. బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని బుధవారం మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తారు. ఒక రోజు అక్కడే ఉండే సూచనలు ఉన్నాయి. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter