Bhuma Akhila Priya Illiness: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఆమె ఛాతినొప్పితో బాధపడుతుండగా.. వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఈసీజీ తదితర పరీక్షలు చేసిన వైద్యులు.. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అడ్మిట్ అవసరం లేదని తెలిపారు. దీంతో అఖిలప్రియను మళ్లీ మహిళా సబ్ జైలుకు తరలించారు అధికారులు. కర్నూలు సబ్ జైల్లో ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియకు నంద్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నంద్యాలలో టీడీపీ నేత నారా లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా స్వాగతం పలికేందుకు భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులు ఆయనను అక్కడి నుంచి కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనపై అఖిల ప్రియపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆళ్లగడ్డలో అఖిలప్రియను అరెస్ట్ చేశారు. నంద్యాల కోర్టులో హాజరు పరచగా.. ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమె రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం కర్నూలు సబ్‌ జైల్లో ఉన్నారు. 


ఏవీ సుబ్బారెడ్డిపై కూడా భూమా అఖిల ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అందరిముందే ఆయన తన చున్నీ పట్టుకుని లాగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చంటిబిడ్డతోనే ఆమె స్టేషన్‌కు రావడం గమనార్హం. టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  


Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  


Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి