Lagadapati : ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్ర విభజన జరుగకూడదని సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించి, రాష్ట్రం ఏర్పాడితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటనని ప్రకటించి రాజకీయ సన్యాసం తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత,విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మైలవరం ఎమ్మెల్యే  వసంత క్రిష్ణ ప్రసాద్ తో భేటి కావడంతో ఏపీ రాజకీయాల్లో రకరకాల చర్చ జరుగుతుంది.ఉమ్మడి ఏపీలో విజయవాడ నుండి 2సార్లు కాంగ్రెస్ ఎంపీగా  గెలిచిన లగడపాటి రాజగోపాల్  రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. అయితే విభజన సమయంలో రాజగోపాల్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏన్నికల సమయంలో  లగడపాటి సర్వేలతో సందడి చేసే వారు. 2019 ఏన్నికల్లో తన సర్వేల ప్రకారం  టీడీపీ గెలుస్తుందని నివేదిక ఇచ్చాడు. కానీ అఏన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో సర్వేలు కూడ మానుకున్నారు. 2019 నుండి రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి మళ్లీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేను  కలవడం హాట్ టాపిక్ అయింది.లగడపాటి ఏందుకు వైసీపీ ఎమ్మెల్యేను కలిసాడు.2024 ఎన్నికల్లో మళ్లీ పోటిచేయనున్నాడా.... లేక తన కుమారుడి సీటు కోసం మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ వైపు చూస్తున్నడా అన్న చర్చ జోరుగా 
సాగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లగడపాటి వైసీపీలో చేరేందుకు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నాడని చర్చ జోరుగా నడుస్తుంది. ఇందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.ఎందుకు కంటే లగడపాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయుడిగా ఉండేవాడు. వైఎస్అర్ మరణాంతరం లగడపాటి రాష్ట్ర విభజన జరగకూడదని సమైక్యంగా ఉండాలని చివరివరకు పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుండి గెలుస్తున్నాడు.2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటి చేసిన పోట్లూరి వరప్రసాద్ ఓడిపోయిన తరువాత సైలెంట్ అయ్యారు.దింతో విజయవాడ ఎంపీగా పవర్ ఫుల్ లీడర్ కోసం వైసీపీ వెతుకుతుంది. అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు గెలువని జగన్ మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్లు టాక్. అందుకని లగడపాటి వైసీపీలోకి ఎంట్రీకి జగన్ ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని చర్చ నడుస్తుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడ టీడీపీతో ఉన్న విభేదాల కారణంగా  పార్టీకి అంటిముట్టనట్టు ఉంటున్నారు. ఇదే అవకాశంగా లగడపాటి పొలిటికల్ ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు. ఇక విజయవాడ టీడీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమాకు గట్టిప్రత్యర్ధి అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటి అయ్యారని తెలుస్తోంది. 


శనివారం నందిగామలో  జరిగిన ఓ కార్యక్రమానికి హజరైన నేతలు కొద్దిసేపు విడిగా భేటి  అయి  తరువాత ఇద్దరు కలిసి లంచ్ కూడ చేశారు. అయితే తమ భేటికి అంత ప్రాధాన్యత లేదని ఇప్పుడు ఉన్న పరిస్థితులు, కొత్త మంత్రివర్గ విస్తరణ మీద చర్చ మాత్రమే జరిగిందని లగడపాటి వైసీపీలోకి రావడం మీద ఎలాంటి చర్చ జరుగలేదని వైసీపీ ఎమ్యెల్యే స్ఫష్టం చేశారు. కానీ లగడపాటి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయడం ఖాయమని వైసీపీలో చేరుతార లేదా అన్న విషయం మీద కొంత క్లారీటి రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లగడపాటి కుమారుడు అశ్రిత్ పొలిటికల్ ఎంట్రీకోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో లగడపాటి ఎంపీగా, తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటి చేయడానికి సిద్ధం అవుతున్నడని బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. మరీ లగడపాటి ప్రతిపాదనను వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తాడా అన్నది పెద్ద ప్రశ్నే.. ఏందుకంటే  లగడపాటి వైసీపీ ఎమ్మెల్యేతో భేటిపై వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. నిజంగా లగడపాటి క్రియశీలక రాజకీయాల్లోకి వస్తున్నాడా.. వస్తే వైసీపీ నుండి పోటి చేస్తాడా.. అసలు ఇవిషయం జగన్ దాకా చేరిందా లేక మీడియా హంగమనా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.


Also read : AP Teachers Protest: సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళనలు


Also read : Tollywood: తెలుగుతెరపై త్వరలో పవన్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ సినిమా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.