Pawan Kalyan Comments On Anitha: హోంమంత్రి అనిత సీరియస్‌గా ఉండకపోతే తానే హోంశాఖ బాధ్యతల చేపట్టాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీలో కాక రేపుతున్నాయి. రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారని పవన్ చెబుతుంటే.. అనితకు పొగినట్లు అనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్నానని.. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారంటీ లేదన్నారు. ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా..? అని నిలదీశారు. దాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలకు మాత్రం దున్నపోతుపై వానపడ్డట్లుందని ఫైర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Virat Kohli Ex Girlfriend: విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హాట్ బ్యూటీని చూస్తే మతిపోద్ది  


ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై సీరియస్‌గా స్పందించి ఉంటే.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతాయని రాచమల్లు ప్రశ్నించారు. మొదట్లోనే వెన్నులో వణుకుపుట్టించేలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. కూటమి నేతలు మాటలకే పరిమితమని.. చేతల మాత్రం శూన్యమని విమర్శించారు. ఎంతసేపు జగన్‌ను నిందించడం.. గొప్పలు చెప్పుకోవడం తప్పా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేందేమి లేదని విమర్శించారు. కనీసం చనిపోయిన బిడ్డల మృతదేహాలను కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. తమ కులం, తమ పార్టీ అంటూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. ఇప్పుడు తప్పించుకున్నా దేవుడి వద్ద మాత్రం శిక్ష తప్పదని అన్నారు.


డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జరిగిన తప్పును.. ప్రభుత్వ అసమర్ధతను కనీసం ఒప్పుకున్నారని అన్నారు రాచమల్లు. పరోక్షంగా సీఎం చంద్రబాబు నాయుడినే పవన్ కల్యాణ్‌ అన్నారని.. నేరుగా ఆయనను అనే ధైర్యం లేకనే హోంమంత్రి మీద పెట్టి అన్నారని విమర్శించారు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డుపడుతున్నందుకే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రభుత్వం తప్పు చేసి.. నింద పోలీసులపై వేస్తున్నారని అన్నారు. 


హోంమంత్రి అనితపై పవన్ కళ్యాణ్‌ సీరియస్ అయితే.. ఆమెకు పొగిడినట్లు ఉందని. నిన్ను పొగిడాడా తల్లీ.. అనిత..? అని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం స్పష్టంగా చెబుతున్నారని.. పవన్ మాటలకు ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు.


Also Read: Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.