కేంద్ర నిర్ణయంతో మరింత దిగొచ్చిన పెట్రో ధరలు
వాహనదారులకు శుభవార్త. పెట్రో ధరలు మరింత తగ్గాయి. పెట్రోల్ పై రూ.2.50 వరకు.. డీజిల్ పై 2.41 మేర ధరలు తగ్గాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ముడిచమురుపై సుంఖం తగ్గించడంతో ఈ మేరకు పెట్రో ధరలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో హైద్రాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 72.40, లీటర్ డీజిల్ ధర రూ.61.81గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 68.38, డీజిల్ ధర రూ. 56.89గా ఉంది. ఎన్టీయే సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రో ఉత్పత్తులపై సుంఖం తగ్గించడం ఇదే తొలిసారి. కాగా తాజా తగ్గింపు నిర్ణయంతో పెట్రోల్ పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం రూ.19.48, డీజిల్ పై వసూలు చేస్తున్న సుంకం రూ.15.33 గా ఉంది.