Fact Check: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రి జగన్ కొట్టారనేది. ఇందులో నిజమేంటో చెక్ చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, సోదరుడు జగన్‌పై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. అదే అదనుగా కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తానేదో అక్రమంగా డబ్బులు సంపాదించుకునేందుకు జగన్ వద్దకు వెళ్లినట్టు వార్తలొస్తున్నాయని అదంతా అబద్ధమని షర్మిల చెప్పినట్టు ఓ వార్త ప్రచురితమైంది. వాస్తవానికి 2019 తరువాత తాను ఒకేసారి ఆస్థుల పంపకాల విషయంలో జగన్ ఇంటికి వెళితే..తన గొంతు పట్టుకుని పిడిగుద్దులు గుద్దాడని, దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ అని షర్మిల చెప్పినట్టుగా అదే వార్తలో ఉంది. ఈ వార్తను టీడీపీ శ్రేణులు పనిగట్టుకుని వైరల్ చేస్తున్నారు. 


దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ చెక్ చేయగా అదంతా ఫేక్ వార్త అని తేలింది. అసలు షర్మిల ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలే చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. తెలుగుదేశం శ్రేణలు షేర్ చేస్తున్న ఆ న్యూస్ క్లిప్పింగ్ ఫేక్ అని తేలిందని వెల్లడించింది. ఏదైనా వార్త నిజమా కాదా తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వార్త కోడ్ ఎంటర్ చేస్తే నిజమేంటనేది తేలిపోతుందని పార్టీ తెలిపింది. 


ఈ వార్త కోడ్ కూడా ఫ్యాక్ట్ చెక్‌లో ఎంటర్ చేస్తే వేరే వార్త కన్పించిందని..షర్మిలకు సంబంధించిన వార్తే లేదని తేలింది. ఎన్నికల సమయంలో ఈ తరహా ఫేక్ వార్తలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఫేక్ వార్తల షేరింగ్ కేవలం ఒక్క పార్టీకే కాకుండా రెండు పార్టీల్నించి కొనసాగుతోంది. 


Also read: AP Cabinet Decisions 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్, 22 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook