AP Cabinet Decisions 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదముద్ర వేసింతి మంత్రి మండలి. ఏకంగా 6,100 పోస్టుల్ని భర్తీ చేయనుంది. వివిధ విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ఎన్నికల వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ చేయూత 4వ విడత నిధుల్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల కోసం 5 వేల కోట్లు విడుదలు చేసేందుకు మంత్రిమండలి ఓకే చెప్పింది. ఏపీ కేబినెట్ ఆమోదించిన ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.
ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్
ఇంధన రంగంలో 22 వేల కోట్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం
ప్రతి గ్రామ పంచాయితీకు ఒక పంచాయితీ సెక్రటరీ నియామకానికి ఆమోదం
యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60-62 ఏళ్లకు పెంపు
అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
నంద్యా, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం
సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాట్కు కేబినెట్ ఆమోదం
విద్యాశాఖలో ఖాళీల భర్తీకు ఆమోదం
Also read: AP Cabinet Meet 2024: ఎన్నికల వేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఐఆర్ ప్రకటన ఇతర వరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook