Yasir Shah: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిపై ఎఫ్ఐఆర్ నమోదు! ఇక కెరీర్ కంచికే!!
పాకిస్థాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారు. దాంతో ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
FIR against Pakistan spinner Yasir Shah for Aiding in Minor's Rape: పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు నిత్యం వార్తల్లోనే ఉంటారు. ఇతర క్రికెటర్లపై ఆరోపణలు చేయడం, అత్యాచారం, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే ఎందరో ఆటగాళ్లు ఫింక్సింగ్ బూతంలో ఇరుక్కుని కెరీర్ నాశనం చేసుకున్నారు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తనను పెళ్లిచేసుంటానని చెప్పి.. మోసం చేశాడని గతంలో ఓ మహిళ ఆరోణలు చేసిన విషయం తెలిసిందే. ఆజామ్‌పై కేసు కూడా నమోదు చేశారు. అది మరవకముందే తాజాగా అత్యాచారం కేసులో పాకిస్థాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (Yasir Shah)పై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది.
యాసిర్ షా (Yasir Shah), అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక (Minor Girl) ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారు. దాంతో ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ షా ఫోన్ చేసి మరీ బెదిరించినట్లు ఆ అమ్మాయి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కిడ్నాప్, వేధింపులు, బెదిరింపుల నేపథ్యంలో యాసిర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Also Read:Free Tabs For Students: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మొబైల్స్, ట్యాబ్స్ పంపిణీ
35 ఏళ్ల యాసిర్ షా (Yasir Shah) పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్లలో ఒకడు. యాసిర్ 46 టెస్టుల్లో 235 వికెట్లు తీశాడు. యాసిర్ షా 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు.అలానే రెండు టీ20 మ్యాచులు ఆడి ఒక్క వికెట్ తీయలేదు. యాసిర్ షా టెస్ట్ స్పెసలిస్ట్ స్పిన్నర్‌గా మంచి గుర్తింపు పొందాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించి అత్యంత విజయవంతమైన పాక్ (Pakistan) స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఘటనతో అతడి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజామ్, మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలు మాత్రం రుజువు కాలేదు.
Also Read: Vastu tips: ఆఫీస్ టేబుల్‌ను ఇలా సెట్ చేసుకుంటే ఇక విజయం మీ సొంతం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి