Free Tabs For Students: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మొబైల్స్, ట్యాబ్స్ పంపిణీ

Free Tabs For Students: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. వృద్ధుల దగ్గర నుంచి యువత వరకు అందర్ని ఆకర్షించేందుకు ప్రతి పార్టీ హామీలను గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 09:22 AM IST
Free Tabs For Students: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మొబైల్స్, ట్యాబ్స్ పంపిణీ

Free Tabs For Students: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలోని కోటిమంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. 

మాజీ ప్రధాని దివంగత అటల్ బిహార్ వాజ్‌పేయీ జయంతి రోజున (డిసెంబర్‌ 25న) వీటి పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నారు. ఆ రోజు లక్ష స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఏఏ విద్యార్థులకు ప్రయోజనం..

ఉత్తరప్రదేశ్ లోని ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, ఎంటెక్‌ తదితర కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు.

డిసెంబరు 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను యువతకు పంపిణీ చేస్తారని తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.   

ALso Read: Omicron Detection Kits: ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు ఇకపై సులభం, త్వరలో డిటెక్షన్ కిట్లు

Also Read: Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News