Visakha Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Visakhapatnam Steel Plant Fire Accident | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Vizag Steel Plant Fire Accident) సంభవించింది. స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొంత సమయానికి మంటలు వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వైజాగ్ ఉక్కు కర్మాగారంలోని 1.2 మెగావాట్ల విద్యుత్ మోటర్లు దగ్ధమయ్యాయి. దీంతో కోట్ల రూపాయాల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe