AP: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల డియర్ నెస్ అలయెన్స్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Last Updated : Nov 4, 2020, 11:53 PM IST
AP: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగుల ( Government Employees )కు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) శుభవార్త అందించింది. ఉద్యోగుల డియర్ నెస్ అలయెన్స్ ( Hike of DA ) ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం డీఏ ఇప్పుడు 27. 248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి క్యాష్ రూపంలో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిల్ని  3 సమభాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎస్ వారికైతే 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం పాన్ అక్కౌంట్ కు జనవరి జీతాల చెల్లింపు అనంతరం అంటే 3 సమాన భాగాల్లో జమ చేస్తామని వివరించింది. 

పెంచిన డీఏను ఎప్పుడు చెల్లించేది, సీపీఎస్ వారికి ఎలా అందించేది సమగ్ర వివరాల్ని ఉత్తర్వుల్లోనే చెప్పడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. Also read: AP Schools: విద్యార్థుల హాజరు శాతంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన

Trending News