Tirupati Accident: వెంటాడిన దురదృష్టం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
Five Maharashtra Devotees Died in Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Five Maharashtra Devotees Died in Tirupati: తొమ్మిది మంది స్నేహితులు కలిసి సంతోషంగా తీర్థయాత్రలకు వచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శనానికి బయలుదేరారు. కానీ ఇంతలో దురదృష్టం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు ఊహించని విధంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా..
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన 9 మంది స్నేహితులు కలిసి తిరుమల దర్శనానికి వచ్చారు. శ్రీవారి దర్శించుకున్న అనంతరం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌కు సందర్శించుకుందామని బయలుదేరారు. అయితే చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్దకు రాగానే.. కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతిచెందారు. మరో నలుగురి తీవ్రంగా గాయాలు కాగా.. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి అడిషనల్ ఎస్పీ కులశేఖర్ తెలిపారు.
సోలాపూర్ నుంచి 9 మంది మిత్రులు కలిసి.. ఈ నెల 23న తిరుపతికి వచ్చారని ఆయన చెప్పారు. మంగళవారం శ్రీవారి దర్శించుకుని.. బుధవారం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శనార్థం బయలుదేరారని అన్నారు. మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. మృతులను ఆనంత్ తెంబుకర్, మయూర్ మట్‌పతి, రిషికేష్ జంగం, అజయ్ నంగనాద్‌గా గుర్తించామని తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని వెల్లడించారు.
Also Read: Nara Lokesh: మాటలకందని భావోద్వేగాలు.. అమ్మానాన్నలకు పాదాభివందనం: నారా లోకేష్ ఎమోషనల్
Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook