Waqf Bill: అధికారంలో ఉన్నన్నాళ్లు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్డీయే సర్కార్‌ ప్రతిపాదించిన వక్ఫ్‌ బిల్లుకు తాము వ్యతిరేకమని సంచలన ప్రకటన చేసింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇలా వైఎస్సార్‌సీపీ స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP Vemireddy: 'నాకు బొకే ఇయ్యాలే'.. అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ


విజయవాడలోని కుమ్మరిపాలెం, ఈద్గా మైదానంలో ఆదివారం వక్ఫ్‌ పరిరక్షణ మహాసభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత విజయసాయిరెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ బిల్లుపై సూటిగా.. స్పష్టమైన ప్రకటన చేశారు. ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించమని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో 9 అంశాలకు వ్యతిరేకంగా లేఖ రాసి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AP Liquor: ఏపీలో మందుబాబులకు మహిళలకు షాక్‌.. వైన్స్‌ వద్దంటూ ఎక్కడికక్కడ మహిళల అడ్డగింత


'వక్ఫ్‌ బిల్లును తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మంత్రివర్గంలో బిల్లును అంగీకరించి.. బయట లోక్‌సభలో మాత్రం టీడీపీ డ్రామాలు ఆడుతోంది. బిల్లుకు సవరణలు చేయాలంటూ టీడీపీ నాటకాలు ఆడుతోంది' అని ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు. ముస్లిం హక్కులు, మనోభావాలు, సాంప్రదాయాలను కాలరాసే ఏ చట్టాలను, సవరణలను తాము అంగీకరించమని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్‌ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు వ్యతిరేకించినట్లు ప్రకటించారు.


టీడీపీ డ్రామాలు
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో చేతులు కలిపి బిల్లును ఆమోదించడానికి ప్రయత్నం చేస్తోందని విజయ సాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ బిల్లును టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు ఆమోదించారని వివరించారు. అయితే లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సవరణలు చేయాలని మాట్లాడి డ్రామా చేశారని గుర్తు చేశారు. వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తే టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సవాల్‌ విసిరారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగేలా ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.


చట్ట సవరణ ద్వారా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు భూములను కుట్ర పూరితంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామని ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడాన్ని, సీఈవోలుగా నియమించడాన్ని కూడా అంగీకరించేది లేదని తెలిపారు. వక్ఫ్‌ బోర్డుకు విరాళాలు ఇవ్వడానికి విధించిన నిబంధనలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.