AP New Districts: ఏపీ చరిత్రలో నవ శకం మొదలైంది. 13 జిల్లాల నవ్యాంధ్ర.. 26 జిల్లాలుగా రూపాంతరం చెందింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని ఇటు ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని తేల్చి చెప్పాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో 13 కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను స్వయంగా వివరించారు. ప్రజల సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాతే  జిల్లాలను ఏర్పాటు చేశామని.. వాటికి పేర్లను ఖరారు చేసినట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలున్నాయని గుర్తు చేశారు. 


రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నవశకానికి సీఎం నాంది పలికారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకత తీసుకువస్తుందన్నారు గవర్నర్. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఉండటం మంచి ఆలోచన అని తెలిపారు. 


కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డాయి. కేవలం రాజకీయ కోణంలో వీటిని ఏర్పాటు చేశారని ఆరోపించాయి. తాము అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశాయి.


ప్రతిపక్షాల వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో నవశకానికి సీఎం జగన్ నాంది పలికారని.. పరిపాలన, ప్రజా సౌకర్యార్థం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మంత్రులు. జిల్లాల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.


మొత్తంగా ఏపీ 26 జిల్లాల నవ్యాంధ్రగా మారింది. కొత్త, పాత జిల్లాల కేంద్రాల నుంచే అధికారులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం నియమించింది.


Also Read: Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్


Also Read: Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook