Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్

Bar shops timings extended in Hyderabad: మందు బాబులకు ఇదొక గుడ్ న్యూస్... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ పని వేళలను పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 07:32 PM IST
  • హైదరాబాద్‌లో బార్ షాప్స్ టైమింగ్స్ పొడగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఇక అర్ధరాత్రి వరకు బార్ షాప్స్
Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్

Bar shops timings extended in Hyderabad: మందు బాబులకు ఇదొక గుడ్ న్యూస్... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ పని వేళలను పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్స్ నిర్వహించుకునేలా అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, వీకెండ్స్‌లో ఏకంగా ఒంటి గంట వరకు బార్లు తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది. ఇక స్టార్ హోటళ్లు, ఎయిర్‌పోర్ట్ హోటళ్లు లైసెన్స్ ఫీజుపై 25 శాతం అదనపు రుసుం చెల్లించి 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. 

తెలంగాణలో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరుతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెలా ఎంత లేదన్నా రాష్ట్రంలో రూ.2500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో రూ.2814 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా... ఇందులో నెలాఖరు రోజునే రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ తర్వాత మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో బార్ షాపుల పని వేళలు పొడగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందనే చెప్పాలి. ఈ నిర్ణయాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేస్తారా... లేక మున్ముందు తెలంగాణవ్యాప్తంగా అన్ని బార్ షాప్స్‌కు దీన్ని వర్తింపజేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఓవైపు డ్రగ్స్ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంటే... ప్రభుత్వం బార్ షాప్ పని వేళలను పొడగించడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు... ఎఫ్ఐఆర్‌లో ఆ నలుగురి పేర్లు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News