Patnam Subbaiah: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత
Patnam Subbaiah Death News Updates: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అనారోగ్య సమస్యలతో కొత్తపల్లిలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని సమాచారం.
Patnam Subbaiah Death News Updates: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అనారోగ్య సమస్యలతో కొత్తపల్లిలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని సమాచారం. గత కొంతకాలం నుంచి ఆయన గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన మరణించారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతిపై నేతలు సంపతాపం ప్రకటిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపు మేరకు పలమనేరుతో ప్రభుత్వ డాక్టర్‌గా సేవలు అందిస్తున్న పట్నం సుబ్బయ్య రాజకీయాల్లోకి వచ్చారు. స్థానికంగా మంచి పేరున్న వ్యక్తి కావడంతో పలమనేరు నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా టీడీపీ(TDP) నుంచి గెలుపొందారు. అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో పౌరసరఫరాల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా పట్నం సుబ్బయ్య విశేష సేవలు అందించారు.
Also Read: జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తనకు సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో బీజేపీలో చేరారు. అయితే ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ వైఖరి నచ్చకపోవడంతో 2019లో తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు.
Also Read: Gold Price Today: పతనమైన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి
కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో పట్నం సుబ్బయ్య మరోసారి యూటర్న్ తీసుకున్నారు. గతేడాది బీజేపీలో చేరిన ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంది. స్థానికంగా పేరున్న డాక్టర్ కూడా కావడంతో పట్నం సుబ్బయ్య మంత్రి పదవి చేపట్టినా సామాన్యుడిగా జీవనం సాగించేవారు.
Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook