మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మంగళవారం ఒక్కరోజు పర్యటనలో భాగంగా మచిలీపట్నం చేరుకున్నారు. టీమిండియా తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాన్ని కుంబ్లే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌ ఛైర్మన్‌ అంకమచౌదరిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంబ్లేకు మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సన్మానించారు. అలాగే, పర్యటనలో భాగంగా కుంబ్లే.. 13 కోట్ల రూపాయలతో పట్టణంలో నిర్మించనున్న అథ్లెటిక్ స్టేడియానికి, మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


13.27 ఎకరాల్లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంతోపాటు, స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించనున్నారు. ఖేలో ఇండియా పథకం కింద ఈ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. స్టేడియం ఏర్పాటు కానుండడంతో కోచ్‌లు, ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే రాకతో మచిలీపట్నంలో సందడి నెలకొంది.


క్రీడలకు పుట్టిల్లైన మచిలీపట్నంలో స్టేడియం నిర్మించటం గర్వకారణమని..ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది క్రీడాకారులను తయారుచేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చేనందుకు జాతీయ, అంతర్జాతీయ కోచ్ లను తీసుకొస్తామని అన్నారు.  స్టేడియంతోపాటు స్పోర్ట్స్‌ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.