Chandrababu Naidu Arrest: చంద్రబాబును అందుకే అరెస్ట్ చేశారు
Chandrababu Naidu Arrest Latest News: విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
Chandrababu Naidu Arrest Latest News: విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది అని ఆగ్రహం వ్యక్తంచేసిన శ్రీనివాస్ రావు.. నిన్నటి నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెడుతోంది అని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడి అరెస్టుపై రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు అని హితవు పలికిన గంటా శ్రీనివాస్ రావు ... ఏపీ మంత్రులకు కనీసం అవగాహన లేదు అని అసహనం వ్యక్తంచేశారు.
దేశంలో ఒకవైపు జీ 20 సదస్సు జరుగుతోంటే .. మరోవైపు మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనడం దారుణం అని గంటా శ్రీనివాస్ రావు అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ రావు.. రాష్టానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక కిమ్ లా, నియంతలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఉద్దేశించి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, " ప్రజా స్వామ్యంలో ఇదొక బ్లాక్ డే " అని అభివర్ణించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉండి వచ్చారు కనుకే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కూడా ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలని మొదటి నుండి కుట్రలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఎలా జైలుకు పంపించాలా అనే శాడిజం ఆలోచనలో వచ్చిందే ఈ కేసులు, అరెస్ట్ అని శ్రీనివాస్ రావు ఆరోపించారు.
" ఇప్పటికే చాలా సార్లు చాలా విషయాల్లో కోర్ట్ ద్వారా మొట్టికాయలు, చివాట్లు పెట్టినప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలే తగ్గిన బుద్ధి చెబుతారు. తప్పకుండా చివరకు న్యాయమే గెలుస్తుంది.. అలాగే చంద్రబాబు నాయుడికి తప్పకుండా చివరికి న్యాయం జరుగుతుంది " అని గంటా శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు.