Padma Shri: పద్మ శ్రీ ప్రకటనపై గరికిపాటి నరసింహారావు ఆనందం!
Padma Shri: పద్మ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోకపోయినా.. తనకు పద్మ శ్రీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు గరికిపాటి నరసింహారావు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Padma Shri: ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు.. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారానికి తాను దరఖాస్తు చేసుకోకపోయినా.. తెలుగు రాష్ట్రాల కృషి అభినందనీయమని (Garikipati narasimha rao on Padma Shri) పేర్కొన్నారు.
తన ప్రవచనాలు కొంత మంది యువతలో, సమాజంలో మార్పులు తీసుకొస్తే అంతే చాలని ఆయన (Garikipati narasimha rao on his speeches) పేర్కొన్నారు.
తాను ఎవరి సత్కారాల ప్రవచనాలు, ప్రసంగాలు చేయడం లేదని స్పష్టం చేశారు గరికిపాటి నరసింహారావు. తన ప్రవచనాలతో కొంతమంది నొచ్చుకుని ఉండొచ్చన్నారు. అయితే ఎవరిని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని వివరించారు.
భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్ల తన పని తాను సక్రమంగా చేసుకుంటూ పోతే.. అన్ని యోగ్యతలు (Garikipati narasimha rao on Awards) కలుగుతాయనన్నారు.
సమాజంలో ప్రవచనకర్తలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు గరికిపాటి నరసింహారావు.
తెలుగు రాష్ట్రాలకు పద్మ పురస్కారాల ప్రకటన ఇలా..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు (Padma Awards) దక్కాయి.
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు (సంయుక్త) పద్మ భూషన్ పురస్కారం ప్రకటించింది కేంద్రం.
మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) తెలంగాణ నుంచి పద్మ శ్రీకి ఎంపికయ్యారు. ఏపీ నుంచి గరికిపాటి నరసింహారావు, వెంకట ఆదినారాయణ రావు (వైద్యం), గోసవీడు షేక్ హసన్ (కళారంగం) నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో (Padma Awards for Telangana and AP) ఉన్నారు.
Also raad: AP New Districts Details: ఏపీ 26 కొత్త జిల్లాల స్వరూపం ఇదే!
Also read: Secret Treasures in Guntur: ఆలయ తవ్వకాల్లో బయటపడిన గుప్త నిధులు.. అందులో ఏమున్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook