Secret Treasures in Guntur: ఆలయ తవ్వకాల్లో బయటపడిన గుప్త నిధులు.. అందులో ఏమున్నాయంటే?

Secret Treasures in Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో గుప్త నిధులు బయటపడ్డాయని పుకార్లు వినిపించాయి. అది విని చుట్టుపక్కల ఊర్ల జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. ఆలయ తవ్వకాల్లో కొన్ని కుండలు బయటపడ్డాయి. అయితే ఆ కుండల్లో ఏమున్నాయంటే?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 09:36 AM IST
    • గుంటూరు జిల్లా వినుకొండలో గుప్తనిధుల ప్రచారం
    • లక్ష్మీ నరసింహ స్వామి గుడి తవ్వకాల్లో బయటపడిన కుండలు
    • అందులో తక్కువ విలువున్న లోహపు రాళ్లని తేల్చి చెప్పిన అధికారులు
Secret Treasures in Guntur: ఆలయ తవ్వకాల్లో బయటపడిన గుప్త నిధులు.. అందులో ఏమున్నాయంటే?

Secret Treasures in Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వినుకొండ  సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తవ్వకాలు జరుపుతుండగా.. ఆ నిధులు బయటపడ్డాయని సమాచారం పొక్కడం వల్ల సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన కుండల్లో ఏమున్నాయో స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు వచ్చారు. ఇంతకీ ఆ కుండల్లో ఏమున్నాయంటే? 

ఏం జరిగిందంటే?

గుంటూరు జిల్లాలోని వినుకొండ సమీపంలో గల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల జరుగుతున్నాయి. అక్కడ జరిపిన తవ్వకాల్లో కొన్ని కుండలు బయటపడ్డాయి. అయితే వాటిని చూసిన వారు గుప్త నిధులు బయటపడ్డాయని భావించారు. అదే విషయం కొన్ని గంటల్లో చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు పాకింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే అక్కడికి జనాలు తండోపతండాలుగా వచ్చిపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి.. ప్రజలను చెదరగొట్టారు. 

అయితే ఆ కుండల్లో ఏముందని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులు విస్తుపోయారు. తవ్వకాల్లో బయటపడిన కుండల్లో బంగారపు ఆభరాణాలు, వజ్రపు ఉంగరాలు ఉంటాయని భావించిన వారికి నిరాశ ఎదురైంది. వాటిలో కొన్ని లోహపు రాళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పురావస్తు శాస్త్రవేత్తలకు పంపారు. 

అయితే ఈ లోహపు ముద్ద‌లు మ‌ధ్య‌యుగం నాటివిగా పురావ‌స్తు శాఖ అధికారులు తేల్చారు. మైనింగ్ శాఖ అధికారులు ప‌రిశీలించి లోహ‌పు ముద్ద‌లు అని తేల్చ‌డంతో వారం రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది.  

Also Read: RTC Reduces Bus Fare: ప్రయాణికులకు శుభవార్త.. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్‌ ఆర్టీసీ

Also Read: AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News