Gautam Adani Case: గౌతమ్ అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ లింకులు, అసలు ఈ కేసు ఏంటి
Gautam Adani Case: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఈ కేసుకు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఏపీలో విదేశీ అధికారులతో భేటీ జరిగిందనే సమాచారం వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gautam Adani Case: రెండు బిలియన్ డాలర్ల సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు నమోదైంది. మరోవైపు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఏపీతో లింకులున్నట్టు తెలుస్తోంది. అప్పటి ఏపీ అధికారులతో అదానీ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తోంది. ఎక్కడో అమెరికాలో నమోదైన కేసు ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
అమెరికాలో అదానీపై కేసు నమోదు కాగానే ఆంధ్రప్రదేశ్‌లో లింకులు కలిగి ఉన్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. 2021లో ఏపీకు చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారనే అభియోగాలున్నాయి. ఒప్పందంలో వేలకోట్లు చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ అదానీ భేటీ జరిగిందని తెలుస్తోంది. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లో గౌతమ్ అదానీ భేటీ అయినట్టు, ప్రభుత్వ అధికారులకు 2,029 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపణలున్నాయి.
ఇది కాకుండా ఏపీలో ఒప్పందాల కోసం కూడా 1750 కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే అభియోగాలున్నాయి. ముఖ్యంగా ఏపీలోని డిస్కమ్‌లో భారీ నష్టాలు వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలను వేగంగా అమలు చేసేందుకు ముడుపులిచ్చారనే ఆరోపణలున్నాయి. అమెరికాలో నమోదైన కేసు ప్రకారం ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్లలకు చెందిన గౌతమ్ అదానీ సహా మేనల్లుడు సాగర్ అదానీ మరో ఐదుగురిపై న్యూయార్స్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్ సహా అనుబంధ సంస్థలకు త్వరగా అనుమతుల కోసం భారీగా లంచాలిచ్చినట్టు అభియోగాలున్నాయి. ఈ ఒప్పందాల్లో 2019-24 వరకూ పనిచేసిన ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెబుతున్నారు.
Also read: Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.