ఎట్టకేలకు గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ దొరికింది..!
ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో చంచల్ గూడా జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్లిన ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో చంచల్ గూడా జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్లిన ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది షరతులతో కూడిన బెయిల్ కావున రూ.10 వేల డిపాజిట్‌తో పాటు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని.. అలాగే వారానికి రెండు రోజులు పంజాగుట్ట పోలీస్ స్టేషనుకు వచ్చి సంతకం పెట్టి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఏ 2 గా పార్వతికి కూడా జడ్జి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, ఆయన వద్ద ఉద్యోగం చేసే ఓ మహిళ డిసెంబరు 30వ తేదిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తగు వీడియో సాక్ష్యాలు కూడా చూపించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదం పై గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు మరియు లిమ్కా రికార్డ్ నెలకొల్పారు. అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.