గిరిజన స్త్రీలకు చంద్రబాబు దీవెన
ఏపీలోని గిరిజన ప్రాంతాలలో నివసించే గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకమే `గిరి చంద్రన్న దీవెన` పథకం.
ఏపీలోని గిరిజన ప్రాంతాలలో నివసించే గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకమే "గిరి చంద్రన్న దీవెన" పథకం. ఈ పథకం కోసం ఏపీలో త్వరలో ప్రకటించబోయే 2018-19 ఆర్థిక బడ్జెట్‌లో భారీ స్థాయిలో కేటాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అందించే ఈ పథకాన్ని ఎక్కువగా గిరిజనులు ఉండే ప్రాంతాలైన చెంచు ఐటీడీఏ (శ్రీశైలం), రంపచోడవరం, పాడేరు (విశాఖ)లో తొలివిడతగా ప్రారంభిస్తున్నారని సమాచారం.
ఃఇప్పటికే ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో "గిరి గోరుముద్దలు" పేరుతో 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతీ రోజూ గుడ్లు, పాలు సరఫరా చేస్తున్నారు. అలాగే అన్న అమృతహస్తం పథకం క్రింద బాలింతలకు ఒక పూట భోజనం అందిస్తోంది ప్రభుత్వం. అయితే ఇక "గిరి చంద్రన్న దీవెన"లో భాగంగా ప్రస్తుత పథకాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అందు కోసం బడ్జెట్‌లో దాదాపు 87 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు సమాచారం.