CM Jagan: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతిపత్రం..!
CM Jagan: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేశారు.
CM Jagan: ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం జగన్ రాష్ట్ర సమస్యలను వివరించారు. రిసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని వినతిపత్రం రూపంలో సమర్పించారు. రీసోర్స్ గ్యాప్ కింద రూ.34 వేల 125.5 కోట్ల గ్రాంట్‌ను ఇవ్వాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6 వేల 627.28 కోట్లను ఇప్పించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాల ప్రకారం రూ.55 వేల 548.87 కోట్లకు ఆమోదం తెలపాలని విన్నవించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద వస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదని..దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని వినతిపత్రంలో వివరించారు. సవరించిన రాష్ట్రానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఏపీలో కొత్తగా ఏర్పాటు అయిన వైద్య కళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లను మంజూరు చేయాలని లేఖలో తెలిపారు. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.
Also read:Minister Harish Rao: తెలంగాణపై మరోసారి విషం కక్కారు..మోదీ, షాపై హరీష్‌రావు ధ్వజం..!
Also read:God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook