Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రెండురోజుపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌యే టార్గెట్‌గా బీజేపీ అగ్ర నేతలు విమర్శలు సంధించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్‌లు ఇస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాపై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. బీజేపీ అగ్ర నేతల ప్రసంగాల్లో అధికార యావ కనిపించిందన్నారు.
బీజేపీ సమావేశాల్లో విషయం ఏమి లేదని..తెలంగాణపై మరోసారి విషం కక్కారని మండిపడ్డారు. వ్యవసాయం రంగంలో 10 శాతం వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వైఫల్యాల చిట్టా రోజు రోజుకు పెరుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు మంత్రి హరీష్‌రావు.
విభజన హామీల గురించి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావిస్తారని ఆశించామని..అదేమి జరగకపోగా.. తెలంగాణ ఏర్పాటుపైనే మరోసారి అక్కసు వెళ్లగక్కారని మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. గత 8 ఏళ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతూనే ఉన్నారని..ఈఏడాది కూడా మొండి చేయి చూపారన్నారు. కేసీఆర్ ఎవరో తమకు తెలియదని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని..ఆయన ఎవరో ప్రజలకు తెలుసని కౌంటర్ ఇచ్చారు.
Also read:TS Police Jobs: తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు అలర్ట్..పరీక్షల షెడ్యూల్ ఇదే..!
Also read:Chandrababu: దేశానికే అల్లూరి గర్వకారణం..పార్లమెంట్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook