ఓ వైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి. ఇదే ఏపీ ప్రభుత్వ లక్ష్యం. పెద్దఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. విశాఖపట్నంలో రెండ్రోజులపాటు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాల్ని వివరించనుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో మార్చ్ 3, 4 తేదీల్లో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ తలపెట్టింది. రెండ్రోజులు జరగనున్న ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయనేది ప్రభుత్వ వర్గాల అంచనా. సమ్మిట్ ఏర్పాట్లను ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలు సైతం సమ్మిట్‌కు హాజరయ్యేలా కసరత్తు పూర్తయింది. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా..దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. మొదటి రోజు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామివేత్తలు హాజరౌతారని..రెండవ రోజు ఒప్పందాలుంటాయని ప్రభుత్వం చెబుతోంది. 


గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కోసం ఇప్పటికే దాదాపు 25 దేశాల్నించి 7500 మంది డెలిగేట్స్ రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ దేశాల్నించి వస్తున్న ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్, సమ్మిట్‌పై హోర్డింగ్స్, సిటీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 


పరిశ్రమలకు, పెట్టుబడులకు ఏపీ గేట్ వే ఆఫ్ ఈస్ట్ కానుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం తూర్పు దేశాలకు ముఖద్వారంగా ఉంటుందంటోంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 పోర్టులుండగా మరో 4 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక 6 ఎయిర్‌పోర్టులు ప్రధాన నగరాల్లో ఉండగా మరో రెండు ఎయిర్‌పోర్టులు నిర్మాణం కానున్నాయి. అత్యంత చౌకధరకు రాష్ట్రంలో తక్షణం 46,555 ఎకరాల భూమి ఉంది. 


Also read: Kuppam Road Accident: కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook