GIS 2023 Updates: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ భారీ సక్సెస్, 353 ఎంవోయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు
Global investors summit 2023: విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను మించి సదస్సు సక్సెస్ అయింది. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరగడంతో..సమ్మిట్ సక్సెస్ చేసిన అందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
Global investors summit 2023: మార్చ్ 3, 4 తేదీల్లో అంటే నిన్న, ఇవాళ విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా 15 రంగాలు ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి. సమ్మిట్ విజయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో తరలివచ్చిన దేశ విఖ్యాత పారిశ్రామిక వేత్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సమ్మిట్‌లోని ముఖ్యమైన విషయాల్ని వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లో..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా 15 రంగాల్లో సెషన్స్ నిర్వహించాం. ఏపీ అభివృద్దికి ఈ 15 సెక్టార్లు అత్యంత కీలకం. ఈ రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి. రెండ్రోజుల్లో 353 ఎంవోయూలతో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యే కంట్రీ సెషన్స్ నిర్వహించాం.
రాష్ట్రంలో పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయలు కేవలం ఎనర్జీ రంగంలోనే రావడం విశేషం. గ్రీన్ ఎనర్జీతో ఇండియా లక్షాల్ని చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకం కానుంది. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
మీరు పెట్టిన పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మరింది.
Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook