Godavari Floods: గోదావరి నదికి భారీ వరద పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంల కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక దిశగా ఉంటే..భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోదావరి నది మరోసారి వరద నీటితో ఉరకలెత్తుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా విస్తారణంగా వర్షాలు పడుతుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూలై నెలలో ఎన్నడూ లేనంత వరద వస్తోంది. అదే సమయంలో ఛత్తీస్‌గడ్‌లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి ఉపనది శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. 


భద్రాచలం వద్ద ఇప్పటికే వరద నీరు 53 అడుగులకు చేరుకుంది. కాస్సేపటి క్రితం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఇటు ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 8.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రంలో వదులుతున్నారు. రాత్రికి తొలి ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. ఎగువన పరీ వాహక ప్రాతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో గోదావరి మరింత ప్రమాదకర స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. 


Also read: Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook