పండగ సీజన్లలో పసిడి ధర అమాంతంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పెరుగుదలతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గిపోవడం బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమంటున్నారు. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వారు దీపావళి పండగ సీజన్ నాటికి ధర ఎలా ఉండబోతోందోనని ఆందోళన చెందుతున్నారు.


మార్కెట్ విశ్లేషకులు అంచనా ప్రకారం పండగ సీజన్ నాటికి బంగార ధర గరిష్ట స్థాయికి చేరుకొని 10 గ్రాములు రూ.34 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో దీపావళి నాడు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి పెను భాగంగా పరిగణించనుంది. ఇదిలా ఉండగా ఈ రోజు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: 29,710 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,560 పలుకుతోంది.