APPSC Notification Released: గుడ్ న్యూస్... ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
నిరుద్యోగులకు శుభవార్త.. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తీ వివరాల కోసం ఇక్కడ చూడండి.
APPSC Notification Released: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 38 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం...
1) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ శాఖలో అసిస్టెంట్ పోస్టులు - 29,
2) డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ పోస్టులు - 6,
Also Read: Virat Kohli Crying Video:ఏడ్చేసిన కోహ్లీ & డివిలియర్స్..ఇంటర్నెట్ లో వైరలైన వీడియో
3) మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు - 01,
4) BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ వార్డెన్ గా పోస్టులు- 02
జాబ్ కోసం దరఖాస్తూ చేసుకునే వారు నవంబర్ 12 - డిసెంబర్ 7 వ వరకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని పి.సీతా రామాంజనేయులు తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, విద్యార్హతలు, ఫీజులు మరియు వయోపరిమితి వంటి ఇతర వివరాల కోసం ఆధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/(S(i3wedubonj2nwil51gu4sznp))/Default.aspx ను సందర్శించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.
Also Read: Covid Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు
డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీలో టెక్నీకల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆర్కియాలజీలో టెక్నీకల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రావాల్సి ఉంటుందని.. త్వరలోనే వాటి సంబంధిత తేదీలు ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook