AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. పదవీ విరమణ, ఇతర కారణాలతో ఉద్యోగాల్నించి వైదొలగిన వారికి పలు ప్రయోజనాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ విన్పించింది. ఇప్పటికే ఆర్టీసీను(RTC) ప్రభుత్వపరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం(Ap government)మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన, ఇతరత్రా కారణాలతో వైదొలగిన ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుకు మార్గం సుగమం చేసింది. ఈ ఉద్యోగుకు లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అక్కౌంట్ హెడ్ నెంబర్లు కేటాయించింది. 2020 జనవరి 1 తరువాత రిటైరైన, ఉద్యోగాల్నించి వైదొలగిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తించేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకుండే ప్రత్యేక అకౌంట్ హెడ్ కేటాయింపుల్ని తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వనుంది. ఈ ఉత్తర్వుల కారణంగా సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ అందనుంది. 


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయిస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపజేసింది. ప్రమాద బీమా, జీవిత బీమా సౌకరం కల్పిస్తోంది. ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అటు కారుణ్య నియామకాల అంశం ఇంకా పరిశీలనలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అటు ప్రభుత్వ నిర్ణయంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(Ap cm ys jagan)కృతజ్ఞతలు తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులు. 


Also read: Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం, రన్ వేపై నిలిచిన విమానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook