Guntur Man Attacks a Girl and her Mother: గుంటూరులో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు ఓ తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో తల్లి, కుమార్తె గాయపడగా...ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని కృష్ణానగర్ పీఎఫ్ కార్యాలయం ఎదుట ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బుధవారం (మే 1) యువతి ఇంట్లోకి చొరబడ్డ ఓ యువకుడు బ్లేడుతో ఆమెతో పాటు ఆమె తల్లిపై దాడి చేశాడు. ఇద్దరి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. దాడి అనంతరం అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు నుంచి దూకి తప్పించుకోబోయాడు.


ఈ క్రమంలో స్థానికులు యువకుడిని అడ్డగించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకుడి దాడిలో గాయపడిన యువతి, ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. పారిపోయే క్రమంలో యువకుడు కూడా బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. దీంతో అతన్ని కూడా జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. నిందితుడిని తెనాలికి చెందిన ధర్మతేజగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also Read: Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..   


Also Read: TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు పొడగించిన టీఎస్‌పీఎస్సీ... ఎప్పటివరకంటే...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook