కరోనాతో హెడ్ కానిస్టేబుల్ మృతి
కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు (Head Constable Dies with Corona). లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కోవిడ్19 టెస్టులు చేపించడంతో పాజిటివ్‌గా తేలింది. చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus In AP), మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న హెడ్ కానిస్టేబుల్ కోవిడ్19 (COVID19)తో పోరాడుతూ శనివారం కన్నుమూశారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
లక్షణాలు కనిపించడంతో ఇటీవల నిర్వహించిన కోవిడ్19 పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారం కిందట మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. హెడ్ కానిస్టేబుల్ మృతిపట్ల ఏపీ పోలీసుశాఖ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!