Royalaseema lift irrigation: ముగిసిన వాదనలు, రిజర్వ్ లో తీర్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ( Royalaseema lift irrigation ) పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( National green tribunal ) లో వాదనలు ముగిశాయి. చెన్నై ( Chennai ) లోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ( Royalaseema lift irrigation ) పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( National green tribunal ) లో వాదనలు ముగిశాయి. చెన్నై ( Chennai ) లోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పధకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ( Telangana ) కు చెందిన శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మంగళవారం నాడు వాదనలు జరిగాయి. 40 వేల క్యూసెక్కుల సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులుగా మార్చారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టమైన నివేదిక ఇచ్చినట్టు కోర్టులో వాదన విన్పించారు.
అయితే రాయసీమ ఎత్తిపోతల ఫధకమనేది కొత్తది కాదని...పాతదేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమకు రావల్సిన నీళ్లనే తీసుకుంటుున్నామని పేర్కొంది. అంతేకాకుండా కేసును త్వరగా ముగించాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరింది. మరోవైపు కౌంటర్ అఫిడవిట్ ద్వారా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) వ్యతిరేకించింది. కేసుపై తమ వైఖరి ఏంటనేది వారం రోజుల్లో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలిచ్చింది ఎన్జీటీ. దీంతోపాటు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ఎన్జీటీ ధర్మాసనం వెల్లడించింది. Also read: Covdi 19 Review : రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్