AP Rains: ఏపీపై తుఫాన్ ప్రభావం ఇలా.. ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rain alert AP: తీవ్ర వాయుగుండం గురువారం ఉదయానికి తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rain alert AP: ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ భయం వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. గురువారం ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి.. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం తెలిపారు. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 610 కి.మీ., చెన్నైకి 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజులపాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్ని పోర్టులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
నేటి నుంచి సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటుని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు అందించేందుకు 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. కిందిస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. పునరావాస కేంద్రాలు, వసతి, ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
Also Read: Assembly Election Result 2022: నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. గెలుపు ఎవరిది..?
Also Read: IND vs BAN: వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు షాక్.. ముగ్గురు ఆటగాళ్లు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి