Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన. ఐఎండీ అంచనాల ప్రకారం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా  కొంకణ్  తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో  ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తులు ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. భారీవర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆదివారం రాష్ట్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం విపత్తుల సంస్థ ఎండీ అంచనా వేశారు. 


పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వైపునకు గాలులు వీస్తున్నాయి. దీంతో వల్ల గురువారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 20 వరకూ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. గురువారం రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని అన్నారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Also Read: Helicopter Crash: కూప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్  


Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి