Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలవైపుగా విస్తరిస్తోంది. ఈ అల్ప పీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడమే కాకుండా..కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక ఈ నెల 17వ తేదీన అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడవచ్చు
ఈ నెల 18 వతేదీన మాత్రం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు కృష్ణా, పెన్నా నదులకు వరదపోటు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 20 తరువాత సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. సూపర్ సైక్లోన్ ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుంది.
Also read: AP Voter Pulse: ఏపీ ఓటరు నాడి ఎటువైపు ? వైసీపీపై వ్యతిరేకత ఉన్నా..ప్రతిపక్షం బలపడలేకపోతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook