Heavy Rains Alert: ఏపీలో జూలై 11 నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పెద్దగా లేకపోయినా వాతావరణంలో మార్పులతో వర్షాలు పడవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ ఏడాది పెద్దగా లేకపోవడంతో వర్షపాతం లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఊహించినంత వర్షపాతం లేదు. ఫలితంగా జూన్ నెల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. జూలై రెండవవారంలో పరిస్థితి మారవచ్చని అంచనా.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. రుతు పవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా ఆశించినమేర వర్షాలు కురిపించలేదు. రాష్ట్రమంతా రుతు పవనాలు విస్తరించిన తరువాత కూడా మోస్తరు వర్షాలే పడ్డాయి. ఫలితంగా జూన్ నెలలో గత ఏడాది లేదా సాధారణ జూన్ వర్షపాతంతో పోలిస్తే 37 శాతం లోటు స్పష్టంగా కన్పిస్తోంది. దీనికి తోడు ఎండ తీవ్రత ఎక్కువై ప్రజలు వేడిమితో అల్లాడిపోయారు. జూలై మొదటి వారం గడిచిపోయింది. తేలికపాటి వర్షాలు లేదా అక్కడక్కడా మోస్తరు వర్షాలు తప్పించి భారీ వర్షాలు పడిన దాఖలాలు లేవు. అయితే జూలై రెండవ వారం పరిస్థితి మారవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జూలై 11వ తేదీ తరువాత పరిస్థితిలో మార్పు రావచ్చని అంచనా. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇందుకు కారణం.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారనుందని ఐఎండీ సూచించింది. పలితంగా రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు అంటే జూలై 10,11,12 తేదీల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. అయితే జూలై 11 తరువాత మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కోస్తా తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురుగాలులు కూడా వీయనున్నాయి.
జూలై 11 నుంచి రాష్ట్రంలోని మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, కడప, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, అనంతపురం, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. జూన్ నెలలో పోలిస్తే జూలైలో వర్షపాతం ఎక్కువే ఉంటుందని అంచనా. కోస్తాంధ్రలో జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు.
జూలై 12 నుంచి తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. జూలైలో కురిసే వర్షాలతో జూన్ నెల వర్షపాతం లోటు తీరవచ్చని అంచనా వేస్తున్నారు.
Also read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook