AP Rains:  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అతి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో  రెండు రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో నేడు వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి పశ్చిమ గోదావరి, ద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.


అనంతపురం, శ్రీ సత్యసాయి,కర్నూలు,  జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణశాఖ. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సముద్రంలోకి వేటకు వెళ్లే జాలర్లు అప్రమత్తంగా ఉండాలి. సముద్రం ఏ క్షణమైనా అల్లోకల్లోలం ఏర్పడే అవకాశాలున్నాయి. మరోవైపు తుఫాను కారణంగా సుడిగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయి. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానం చేసేవారు ఒడ్డునే నిలబడి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సముద్రంలోకి వెళ్ల కూడదని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సముద్ర తీరంలో స్నానం చేసే భక్తుల విషయంలో స్థానికంగా ఉండే పోలీసులను అప్రమత్తం చేసింది. అంతేకాదు పోలీసులు సముద్ర తీరంలో గస్తీ నిర్వహిస్తున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.