Indrakeeladri: ఏపీలో వరుణుడు శాంతించడం లేదు. గత మూడురోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఇటు విజయవాడలో గత రెండురోజులుగా ముసురు పట్టుకుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో ఇంద్రకీలాద్రిలోని దుర్గగుడి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దుర్గగుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసి వేశారు. గత మూడురోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. మరోవైపు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు విరిగిపడుతున్నాయి. మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. 


భారీ వర్షాలు కురుస్తుండటంతో ఘాట్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తామన్నారు.  శాకాంబరీ ఉత్సవాల దృష్ట్యా భారీగా వచ్చే వాహనాలను మహా మండపం ద్వారానే అనుమతి ఇస్తున్నామన్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని తేల్చి చెప్పారు.


Also read: Amma Raja Sekhar: వాడికి డాన్స్‌ రాదు..వాడొక వేస్ట్ ఫెలో..హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ హాట్ కామెంట్స్..!


Also read: Bandi Sanjay on CM Kcr: టీఆర్ఎస్‌కు ప్రజాగ్రహం తప్పదు..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook