Heavy Rains in Kadapa District: కుండపోత వర్షాలకు కడప జిల్లా(Kadapa District)లోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల(Heavy Rains)కు రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం(Annamayya Reservoir) మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పలు గ్రామాలు నీటమునిగాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగువ ప్రాంతాల నుంచి చెయ్యేరు నది(Cheyyeru River)కి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి  భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నందలూరు(Nandaluru) వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.


Also Read: శ్రీవారి ఆలయానికి పోటెత్తిన వరద...మెట్ల మార్గాలను మూసేసిన తితిదే...


వరద ప్రవాహానికి సుండుపల్లి వద్ద పింఛ ప్రాజెక్టు మట్టికట్ట 3 మీటర్ల మేర కోతకు గురైంది. పింఛ నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వరద ప్రవాహం చేరడంతో 5 గేట్లు ఎత్తి లక్షా 50 వేల కూసెక్కుల నీరు దిగువకు వదిలారు. వెలిగళ్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాపాగ్ని(Papagni)కి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. కమలాపురంలో అనేక కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నందూలూరు- రాజంపేట రైల్వే ట్రాక్ కి.మీ మేర కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్(Railway Track) కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook