Rains In AP: ఆంధ్రప్రదేశ్‌ను అకాల వర్షాలు వీడడం లేదు. అంతర్గత తమిళనాడు నుంచి విదర్భ వరకు రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనము కొనసాగుతోందన్నారు. దీంతో రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ &యానాం: 


ఈరోజు: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల  సంభవించే అవకాశం ఉంది.


రేపు, ఎల్లుండి: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశం. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల  సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా  ఆంధ్రప్రదేశ్:


ఈరోజు: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల  సంభవించే అవకాశం ఉంది.


రేపు, ఎల్లుండి: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశం. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల  సంభవించే అవకాశం ఉంది


రాయలసీమ : 


ఈరోజు: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశం. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల  వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది.


అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో  వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. కుమురంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  


Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి