Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 02:53 PM IST
Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Rahul Gandhi Parliament Membership: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది. దీంతో లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాపాతినిధ్యం చట్టం కింద రెండేళ్లు, ఆపై కాలం శిక్ష పడిన ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన అనంతరం బెయిల్ మంజూరు చేసింది. శిక్ష అమలును 30 రోజుల పాటు నిలిపివేసింది. కోర్టు తీర్పును కాంగ్రెస్ నాయకులు పై కోర్టులో సవాలు చేయనున్నారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై సూరత్ కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ గాంధీ ప్రకటన మొత్తం మోడీ వర్గాన్ని కించపరిచేలా ఉందని.. మోడీ వర్గం పరువు తీశారని ఆయన ఫైర్ అయ్యారు. 

రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద కేసు నమోదు అయింది. రాహుల్ గాంధీ ర్యాలీలో ఉద్దేశ పూర్వకంగా చేశారంటూ ఆయన ప్రసంగం సీడీలను పూర్ణేష్ మోడీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 202 ప్రకారం న్యాయ ప్రక్రియను అనుసరించనందున.. ప్రొసీడింగ్‌లు మొదటి నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. అక్టోబర్ 2021లో రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని సూరత్ కోర్టుకు నమోదు చేసింది. రెండు పక్షాల వాదనాలు విన్న కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

కోర్టు జైలు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దవుతుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్లు ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 'పిరికి, నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. బీజేపీ చీకటి పనులను తాము బహిర్గతం చేస్తున్నందున కక్ష కట్టిందన్నారు. రాజకీయ దివాళా తీసిన మోదీ ప్రభుత్వం.. ఈడీ, పోలీసులతో దాడులు చేయిస్తోందంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రసంగాలపై కేసులు వేస్తుందన్నారు. హైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ అనర్హత అంశంపై  న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు. తాము మౌనంగా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదానీ స్కామ్‌పై జేపీసీ వేయాలని కోరితే రాహుల్ గాంధీని  అనర్హత వేటు వేశారంటూ ఫైర్ అయ్యారు. 

Also Read: Bandi Sanjay: కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ.. అది సిగ్గుచేటు: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News