Floods in AP: వరద విలయం.. చంటి బిడ్డను ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి.. గుండెను పిండేస్తున్న వీడియో..
Heavy rain in andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో వరద కన్నీళ్లను మిగిల్చింది. ఎక్కడ చూసిన కూడా తాగేందుకు కూడా నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా ఏపీ లోని అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో గుండెను పిండేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Heavy rain floods in andhra pradesh: రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వరుణుడు కుండపోతగా వర్షాన్ని కురిపించాడు. చెరువులన్ని పొంగిపొర్లాయి. భారీగా వరదలు సంభవించడంతో రాత్రికి రాత్రే అనేక కాలనీల్లో కూడా భారీగా నీరు వచ్చి చేరిందని చెప్పుకొవచ్చు. అనేక అపార్ట్ మెంట్ లు రాత్రికి రాత్రే నీటిలోకి మునిగిపోయాయి. మూడంతస్థుల బిల్డింగ్ లు సైతం.. నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పై అంతస్తుల్లోకి వెళ్లి ఎంతో మంది ప్రాణాలను కాపాడుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ పరిస్థితి చాలా దయానీయంగా ఉందని చెప్పుకొవచ్చు.
ఎక్కడ చూసిన వరద నీళ్లు కన్పిస్తున్నాయి. ఇప్పటికి కూడా అక్కడ వరదల వల్ల అధికారులు సైతం సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అనేక అపార్ట్ మెంట్లలో బురద నీరు చేరడం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఆంద్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి, మంత్రులు, అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆర్మీ, డిజాస్టర్ ఫోర్స్ సైతం రంగంలోకి దిగి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా. వరదల్లో ఉన్నవారిని బోట్ లు,ట్రాక్టర్ లు, జేసీబీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక గుండెను పిండేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు...
విజయవాడలోని సింగ్ ప్రాంతంలో వరదలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఎంతో మంది అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. ఇళ్లలోఒకవైపు వరద నీరు, మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న సహాయం కూడా సరిగ్గా అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మరో ప్రాంతానికి వెళ్లే ఏర్పాట్లు లేక.. దైర్యం చేసి బురదల్లో వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో సింగ్ నగర్ లో.. ఒక చిన్నారిని కూడా తొట్లేలో పడుకొబెట్టి ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి మరీ వరద నీళ్లలోని, వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. పాపం.. చిన్నారి అంత భారీ వరదల్లో కూడా.. తొట్టెలో మరోక ప్రాంతానికి వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా తరలిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు గుండెను పిండేస్తుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.