Srisailam dam gates opened: కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‎ నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4,99,816 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,04,948 క్యూసెక్కులుగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 884 అడుగులు నిండుగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 211.9572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టులోకి (Srisailam project) ఇంకా వరద నీరు వచ్చిచేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ నుంచి 10 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. 


Also read : భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ


నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో (Srisailam power stations) నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


Also read : Godavari Floods: గోదావరికి వరద పోటు, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook