Godavari Floods: గోదావరికి వరద పోటు, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: గోదావరి ఎరుపు రంగు సంతరించుకుంది. ఎర్రటి నీళ్లతో ఉరకలెత్తుతూ ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తోంది. వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2021, 12:31 PM IST
Godavari Floods: గోదావరికి వరద పోటు, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: గోదావరి ఎరుపు రంగు సంతరించుకుంది. ఎర్రటి నీళ్లతో ఉరకలెత్తుతూ ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తోంది. వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

గోదావరి వరద(Godavari Flood)నీటిలో పరవళ్లు తొక్కుతోంది. గోదావరి పరివాహకప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో వరద నీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. ఫలితంగా గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. ప్రతిగంటకూ నీటిమట్టం పెరుగుతోంది.ఇప్పటికే భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, పరివాహక ప్రాంతంలో అల్పపీడనం కారణంగా గోదావరి వరద మరింత పెరగవచ్చని తెలుస్తోంది. నిన్న భద్రాచలం వద్ద 20 అడుగులున్న నీటిమట్టం 24 గంటల్లో 43 అడుగులకు చేరుకుంది. దిగువన ధవళేశ్వరం బ్యారేజ్(Dowlaiswaram Barrage)నుంచి 3 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. సహాయం కోసం 9392919743 నెంబర్‌కు ఫోటోలు వాట్సప్ చేయాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 08744241950, 0874323244 లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. 

Also read: Visakha steelplant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కీలక పరిణామాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News