హైదరాబాద్‌ : కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాల గురించి ఫిర్యాదు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో.. ఆయా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని  ఆదేశిస్తూ ఇటీవలే కొందరికి నోటీసులు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో 57 మందికి ఈ నోటీసులు అందడం గమనార్హం.  అయితే  సీఎం చంద్రబాబు తాను ఉంటున్న ప్రస్తుత నివాసాన్ని,  నదీ పరిరక్షణ చట్ట నియమ నిబంధనలను బేఖాతరు చేస్తూ  నిర్మించిన లింగమనేని గ్రూపు నుండి  లీజుకు మాత్రమే తీసుకున్నారు. అదే నదీ పరివాహక కరకట్ట ప్రాంతంలో  నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన ఇల్లు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కూడా ఉన్నాయి. అయితే ఈ విషయానికి చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.