AP Parishad Elections 2021: ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
AP Parishad Elections 2021 | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రస్తుతానికి ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
AP Parishad Elections 2021 | ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రస్తుతానికి ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ కావాలన్న విషయాన్ని పిటిషనర్లు హైకోర్టుకు విన్నవించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు ప్రస్తుతానికి నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికాలం పూర్తి కావడంతో ఏపీ నూతన ఎస్ఈసీ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కొనసాగాలని ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. తమ ఫిర్యాదులను సైతం పరిశీలించకుండా, బలవంతపు ఏకగ్రీవాలు చేపిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దిక్కరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. టీడీపీ అయితే ఏకంగా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం తెలిసిందే.
Also Read: AP ZPTC Elections: పరిషత్ ఎన్నికలపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
పరిషత్ ఎన్నికల నిర్వహణపై వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీలో ప్రజాస్వామ్యం కరువైందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా, తాజాగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయి. గతంలో 1 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవమవగా, 19 శాతం ఏకగ్రీవం అయ్యాయని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan on CM post: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook