High Temperatures: వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఎండలు, వడగాల్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదై ఠారెత్తిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి పీక్స్‌కు చేరే మే నెలలో సూర్యుడు భగభగమండుతున్నాడు. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలపై ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎండలు భారీగా పెరిగిపోయాయి. అటు వడగాల్పుల తీవ్రత అధికమైంది. కోస్తా ప్రాంతంలో గత 3 రోజుల్నించి ఎండల తీవ్రత ఎక్కువైంది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమంటున్నాయి. రాత్రి 7-8 గంటల వరకూ వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగింది. కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో మొన్న అంటే మే 22వ తేదీ ఆదివారం నాడు 41 డిగ్రీలు దాటేసింది. రాజమండ్రిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. వరుసగా రెండవరోజు అంటే మే 23వ తేదీ సోమవారం నాడు కూడా ఒకేసారి 2-3 డిగ్రీలు పెరిగిపోయింది. రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదు కాగా, నల్గొండలో 43 డిగ్రీలు, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో వరుసగా 42 డిగ్రీలు నమోదైంది.


రాజమండ్రిలో రికార్డు బ్రేక్


ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నిన్న అంటే సోమవారం నాడు రాజమండ్రిలో అత్యధికంగా నమోదైంది. రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు నమోదైంది. రాత్రి 8 గంటల వరకూ వడగాల్పులు కొనసాగాయి. అంతకుముందు అంటే ఆదివారం నాడు కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. రాజమండ్రిలో నిన్న నమోదైన 48 డిగ్రీల ఉష్ణోగ్రత రెండు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. వాస్తవానికి మే 17వ తేదీ నుంచి రాజమండ్రిలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. మద్యాహ్నం 1 గంటైతే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. కర్ఫ్యూ వాతావరణం కన్పిస్తోంది. 


వాస్తవానికి రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు. మే 25 నుంచి అంటే రేపట్నించి ప్రారంభమై..జూన్ 8 వరకూ కొనసాగనుంది. రోహిణి కార్తెలో కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన ఎక్కువవుతోంది. 


Also read: Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన టొమాటో ధర, కిలో టొమాటో ఇప్పుడు వంద రూపాయలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook