Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన టొమాటో ధర, కిలో టొమాటో ఇప్పుడు వంద రూపాయలు

Tomato Price: టొమాటో చేదెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మండిపోతున్నాయి. టొమాటో కొనుగోలు సామాన్యుడికి భారంగా మారింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో తెలుగు ప్రజలు తల్లడిల్లుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2022, 01:42 PM IST
  • ఆకాశాన్నంటుతున్న టొమాటో ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో కిలో టొమాటో వంద రూపాయలకు చేరుకున్న పరిస్థితి
  • టొమాటో దిగుబడి విపరీతంగా తగ్గడమే కారణం, పొరుగు రాష్ట్రాల్నించి దిగుమతి
Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన టొమాటో ధర, కిలో టొమాటో ఇప్పుడు వంద రూపాయలు

Tomato Price: టొమాటో చేదెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మండిపోతున్నాయి. టొమాటో కొనుగోలు సామాన్యుడికి భారంగా మారింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో తెలుగు ప్రజలు తల్లడిల్లుతున్నారు.

ఓ వైపు వేసవి మండుతోంది. మరోవైపు టొమాటో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టొమాటో పరిస్థితి దయనీయంగా మారింది. పంటల దిగుబడి తగ్గడంతో రోజురోజుకూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అటు నాన్‌వెజ్ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కొనేటట్టు లేదు..తినేటట్టు లేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా టొమాటో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ టొమాటో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ కిలో టొమాటో 50 రూపాయల వరకూ ఉండగా..గత రెండ్రోజుల్నించి పరిస్థితి మరీ దారుణంగా మారింది. కిలో టొమాటో కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలు పలుకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో కిలో టొమాటో 70 రూపాయల వరకూ ఉంది. చిత్తూరు, మదనపల్లి, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కిలో టొమాటో ధర 70 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఫలితంగా ఇతర రాష్ట్రాల్నించి టొమాటో దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి.

మార్చ్ నెలలో కిలో టొమాటో 30 రూపాయలుంటే..ఏప్రిల్ నాటికి 60 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు అదే టొమాటో కిలో ధర వంద రూపాయలకు చేరుకుంది. పంటల దిగుబడి తగ్గడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. తొలకరి వచ్చేవరకూ ఇదే పరిస్థితి తలెత్తవచ్చని అంటున్నారు. 

Also read: MLC Ananthababu: హంతకుడిని గారూ అని సంబోధిస్తారా! కాకినాడ ఎస్పీపై జనాల ఫైర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News